కలం, వెబ్ డెస్క్ : టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup) కు సంబంధించి బంగ్లాదేశ్ (Bangladesh) జర్నలిస్టుల అక్రెడిటేషన్ అంశం తాజాగా కొత్త మలుపు తీసుకుంది. మొదట దరఖాస్తులన్నీ తిరస్కరించారన్న వార్తలు కలకలం రేపగా, ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఈ వ్యవహారంపై స్పష్టత ఇచ్చింది. అక్రెడిటేషన్ ప్రక్రియను మళ్లీ సమీక్షిస్తున్నట్టు ఐసీసీ వర్గాలు తెలిపాయి. భద్రతా కారణాలు చూపిస్తూ బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రావడాన్ని నిరాకరించిన తర్వాత, ఆ స్థానంలో స్కాట్లాండ్ (Scotland) ను టోర్నమెంట్లో చేర్చారు.
ఈ పరిణామంతో మ్యాచ్ షెడ్యూల్ మారిందని, దాని ప్రభావం మీడియా అక్రెడిటేషన్‌పై పడిందని ఐసీసీ భావిస్తుంది. దరఖాస్తుల సంఖ్యను కొత్త పరిస్థితులకు అనుగుణంగా తిరిగి పరిశీలిస్తున్నట్టు సమాచారం. దేశాల వారీగా నిర్ణయించిన కోటా పరిమితులు కీలకమని ఐసీసీ (ICC) స్పష్టం చేసింది. ఆ పరిమితిని మించి అక్రెడిటేషన్లు ఇవ్వలేమని పేర్కొంది. హోస్ట్ బోర్డు సూచనల ఆధారంగా తుది నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది.
ఈ వ్యవహారంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పందించింది. మీడియా కమిటీ చైర్మన్ అంజాద్ హొసైన్, తమ దేశానికి చెందిన జర్నలిస్టుల దరఖాస్తులన్నీ తిరస్కరణకు గురయ్యాయని నిర్ధారించారు. ఈ నిర్ణయంపై వివరణ కోరుతూ ఇప్పటికే ఐసీసీకి సమాచారం పంపినట్టు చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ మీడియా ప్రతినిధులు అక్రెడిటేషన్‌కు మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ప్రతి దరఖాస్తును విడిగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి.
Read Also: సంజూ శాంసన్‌కు మరో ఛాన్స్.. ఆశలు ఇంకా ఉన్నాయి !
Follow Us On: Sharechat


