కలం, జనగామ: జనగామ జిల్లా పాలకుర్తి తహసీల్దార్ (Tahsildar) సరస్వతి తన కుమారుడిని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో చేర్పించారు. సర్కార్ బడిలో అన్నిరకాల వసతులు, ఉత్తమ ఉపాధ్యాయులు, నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటాయని ఆమె తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయన్నారు. ఉత్తమ పాఠశాలగా పేరొందిన పాలకుర్తి (Palakurthi) ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో తన కుమారుడిని చేర్పించండం గర్వంగా ఉందన్నారు. తన కుమారుడిని ప్రభుత్వ బడిలో చేర్పించినందుకుగాను.. ప్రధానోపాధ్యాయులు చిదిరాల శ్రీనివాస్, పాఠశాల సిబ్బంది, ఇతర అధికారులు తహసీల్దార్ సరస్వతిపై ప్రశంసల వర్షం కురిపించారు.
Read Also: ప్రశాంత, పచ్చని, ప్రగతిశీల నగరంగా ఖమ్మం
Follow Us On: Sharechat


