కలం, వెబ్ డెస్క్ : సముద్రంలో వేటకు వెళ్లి పొరపాటున సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ పోలీసులకు చిక్కిన భారతీయ మత్స్యకారుల (Indian Fishermen)కు ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. గత కొంతకాలంగా బంగ్లాదేశ్‌లోని భగర్ హాట్ జైలులో మగ్గుతున్న 23 మంది మత్స్యకారులు తాజాగా విడుదలయ్యారు. వీరిలో 9 మంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు ఉన్నారు.
చాలా కాలం తర్వాత తమ వారు క్షేమంగా తిరిగి వస్తున్నారనే వార్త ఉత్తరాంధ్రలోని బాధిత కుటుంబాల్లో ఆనందం నింపింది. జైలు నుంచి విడుదలైన వెంటనే మత్స్యకారులు (Indian Fishermen) ఫోన్ల ద్వారా తమ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రస్తుతం విడుదలైన మత్స్యకారులు అన్ని అధికారిక ప్రక్రియలు పూర్తి చేసుకుని మరో ఐదారు రోజుల్లో తమ స్వగ్రామాలకు చేరుకోనున్నారు.
Read Also: నా మూలాలు భారత్‌లో : ఆంటోనియో కోస్టా
Follow Us On : WhatsApp


