కలం, వెబ్ డెస్క్: టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి గత ఎన్నికల సమయంలో నారా లోకేశ్ (Nara Lokesh) రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ రెడ్‌బుక్ టీడీపీ కార్యకర్తల్లో ఉత్తేజంనింపింది. అయితే కూటమి ప్రభుత్వంలో రెడ్‌బుక్ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని విమర్శలొస్తున్నాయి. కానీ ఇదే సమయంలో అధికారం కోల్పోయిన వైసీపీ నేతలు లోకేశ్‌పై రాజకీయ ఆరోపణలు చేయడానికి భయపడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) రెడ్‌బుక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
“నా పేరు రెడ్ బుక్‌లో ఉందో లేదో ఎవరికి తెలుసు. మీరు వెళ్లి లోకేశ్‌నే అడగండి. అందులో నా పేరు ఉన్నా, నేను అస్సలు బాధపడను. నా కుక్క కూడా రెడ్ బుక్‌కు భయపడదు. రాజశేఖర్ రెడ్డి వెంట నడిచిన వాళ్లం. జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన వెంట ఉన్నాం. మీ రెడ్‌బుక్‌లకు, పిచ్చిబుక్‌లకు భయపడే పిరికివాళ్లం కాదు’’ అని అంబటి (Ambati Rambabu) అన్నారు. ఇప్పటికే కొంతమంది వైసీపీ నాయకులు అనేక కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో లోకేశ్ రెడ్‌బుక్ పట్ల భయం కోల్పోయినట్లు కనిపిస్తోందని రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు.
Read Also: కల్తీ నెయ్యి కేసు.. వైసీపీ అలా.. కూటమి ఇలా..!
Follow Us On: Sharechat


