కలం, సినిమా: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్(Rahul Sankrityan) కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా గ్రాండ్ గా రూపొందుతుంది. నేడు రిపబ్లిక్ డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ సారి విజయ్ దేవరకొండ “రణబాలి”(RANABAALI) గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు
1878 కాలంలో బ్రిటిష్ వారు రాయలసీమ ప్రజలను చిత్ర హింసలకు గురిచేయగా వాళ్ళని ఎదిరించి పోరాడే ఒక యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఈ సినిమాలో జయమ్మ పాత్రలో నటిస్తుంది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ఓస్లో బ్రిటిష్ వ్యక్తిగా నెగెటివ్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 11న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ గ్లింప్స్ చూసిన రౌడీ ఫ్యాన్స్ ఈ సారి విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ అందుకోవడం ఖాయం అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ‘రణబాలి’ గ్లింప్స్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది.


