epaper
Monday, January 26, 2026
spot_img
epaper

ఆదిత్య 999 ముహూర్తం ఫిక్స్ ?

కలం, సినిమా : నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) నట వారసుడు మోక్షజ్ఞ (Mokshagna) సినీ రంగప్రవేశానికి అంతా సిద్ధమైనట్లు తెలుస్తుంది. మోక్షజ్ఞ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ఆదిత్య 999 (Aditya 999) గురించి ఇంట్రెస్టింగ్  అప్డేట్ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిందని తెలుస్తుంది. వచ్చే నెలలోనే ఆదిత్య 999 సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రారంభ  తేదీ ఎప్పుడు అనేది మేకర్స్ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారట.

ఆదిత్య 999 చిత్రాన్ని దర్శకుడు క్రిష్ (Krish Jagarlamudi) రూపొందించనున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీకి సరిపోయేలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో క్రిష్ కథను సిద్దం చేసినట్లు తెలుస్తుంది. మోక్షజ్ఞ కూడా హీరోగా మెప్పించేందుకు అన్ని విధాలా సన్నద్ధమవుతున్నారు. ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్వినీ గ్రాండ్ గా నిర్మించనుంది. బాలకృష్ణ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని సినిమాల్లో ఒకటైన హిట్ మూవీ ఆదిత్య 369కు సీక్వెల్ గా ‘ఆదిత్య 999’ సినిమాను రూపొందిస్తున్నారు.

దర్శకుడు క్రిష్ బాలకృష్ణతో గౌతమీపుత్రశాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు చేశారు. బాలకృష్ణకు క్రిష్ ప్రతిభ మీద చాలా నమ్మకం. అందుకే ఆయన తన వారసుడిని తెరకు పరిచయం చేసే బాధ్యతను క్రిష్ కు అప్పగించారు. క్రిష్ కూడా సక్సెస్ అందుకొని చాలా కాలమే అయింది. Aditya 999 విజయం క్రిష్ కు  చాలా అవసరం. అందుకే ఈ మూవీపై క్రిష్ మరింత శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తుంది.

 Read Also: హెలికాప్టర్ గిఫ్ట్ ఇస్తా అంటున్న మెగాస్టార్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>