epaper
Monday, January 26, 2026
spot_img
epaper

దేవర 2కి టైమ్ ఫిక్స్ అయ్యిందా..?

క‌లం, వెబ్ డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva).. ఈ ఇద్దరి కాంబోలో రూపొందిన దేవర ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. నెగిటీవ్ టాక్ వచ్చినా.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. అయితే.. ఈ మూవీకి సీక్వెల్‌గా దేవర 2 (Devara 2) ఉందని ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ.. ఆ ప్రాజెక్ట్‌ ఇంత వరకు పట్టాలెక్కలేదు. ఆ మధ్య దేవర 2 లేదని ప్రచారం జరగడం.. అందుకనే కొరటాల చైతూతో సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు రావడం జరిగింది. ఇప్పుడు దేవర 2 గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ.. ఏంటా ఇంట్రెస్టింగ్ న్యూస్..?

దేవర సినిమాకి వచ్చిన రిజ‌ల్ట్ దృష్టిలో పెట్టుకొని దేవర 2 లో చాలా మార్పులు చేర్పులు చేశాడట కొరటాల. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ఎన్టీఆర్ ఎప్పుడంటే.. అప్పుడు పట్టాలెక్కించడానికి అంతా రెడీ చేశాడట కొరటాల. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి అంతా ఫిక్స్ అయ్యిందట. జూన్ నుంచి దేవర 2(Devara 2) షూటింగ్ స్టార్ట్ చేయాలని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యాడట. అఫిషియల్‌గా అనౌన్స్ మెంట్ రాలేదు కానీ.. అంతా రెడీ అయ్యిందని మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయట. ఈ మూవీ షూటింగ్‌కి వెళ్లకుండానే.. అనిరుధ్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ కంప్లీట్ చేయనున్నాడట. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా కథలో భారీగా మార్పులు చేశాడట కొరటాల. దేవర పార్ట్ 1 లో జాన్వీ కపూర్ క్యారెక్టర్‌కు అంత‌గా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు దేవర పార్ట్ 2 లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. విలన్‌గా నటించిన సైఫ్ అలీఖాన్ క్యారెక్టర్‌కు ఇంకా మెరుగులు దిద్దాడట. దేవర పార్ట్ 1లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. పార్ట్ 2 లో కూడా వీరి పాత్రలు ప్రత్యేకంగా ఉంటాయట. మొత్తానికి దేవర 2 విషయంలో కొరటాల చాలా కసరత్తు చేశాడు. మరి.. దేవర 2 తో యంగ్ టైగర్‌కు ఎలాంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి.

Read Also: లైంగిక వేధింపుల కేసులో ‘ధురంధర్’ నటుడు అరెస్ట్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>