epaper
Monday, January 26, 2026
spot_img
epaper

సమైక్యం.. ఏకీకృతం కాదు.. గణతంత్ర సందేశంలో సీఎం సెన్సేషన్

కలం, తెలంగాణ బ్యూరో : కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ (CM Stalin) సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటికే హిందీ భాష విషయంలో ఉత్తర, దక్షణ భారత్ మధ్య అగాధం నెలకొన్న బ్యాక్‌గ్రౌండ్‌లో ‘రిపబ్లిక్ డే మెసేజ్’లో స్టాలిన్ కీలక కామెంట్లు చర్చకు దారితీసింది. ‘సమైక్య భారత్‌’గానే (Unified India) ఉండాలని, ‘ఏకీకృత భారత్‌’గా (Uniform India) కాదు అని ఆ సందేశంలో పేర్కొన్నారు. ‘భిన్నత్వంలో ఏకత్వం’ స్ఫూర్తి ప్రాతిపదికన దేశం కొనసాగుతూ ఉన్నదని గుర్తుచేశారు. ఇప్పటికే గవర్నర్‌కు, గవర్నమెంటుకు మధ్య అగాధం పెరిగిన సమయంలో రిపబ్లిక్ డే రోజునే సీఎం స్టాలిన్ భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. “మనం ‘సమైక్య భారత్‌’గా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుందాం… ‘ఏకీకృత భారత్’గా కాదు అంటూ తన మెసేజ్‌లో నొక్కిచెప్పడం గమనార్హం.

ఐక్యంగానే అభివృద్ధి పథంలోకి… :

“ఇప్పుడు మనం చూస్తున్న దేశం వేర్వేరు భాషలు, వేర్వేరు సంస్కృతులు, వేర్వేరు అస్థిత్వాలతో రూపుదిద్దుకున్నది… ప్రజలు స్వేచ్ఛతో, విశ్వాసంతో, ఆత్మగౌరవంతో ఉన్నప్పుడే దేశం పురోగమిస్తుంది… ఒకరిని మరొకరు గౌరవించుకునే సంస్కృతితో మన దేశాన్ని నిలపాలి… మన భాషలన్నీ గర్వంగా మనుగడ సాగించాలి.. విశ్వాసం వ్యక్తిగతమైన వాస్తవం.. మన బలం ఎప్పుడూ ఒక్కటిగా ఉండదు.. ఎప్పుడూ బహుళత్వంతో కూడి ఉంటుంది.. భిన్నత్వాన్ని పరిరక్షిస్తే అది ఒక సహజమైన అనుభూతి… భవిష్యత్తు ప్రతీ ఒక్కరికీ చెందేది.. సమానత్వంతో కూడినది కూడాను.. బహుళత్వంతో ఉందాం.. గర్వంగా నిలబడదాం…” అంటూ తన రిపబ్లిక్ డే మెసేజ్‌లో పేర్కొన్నారు. అభివృద్ధి దిశగా పురోగమిస్తున్న తమిళనాట ఏ ఒక్కరినీ వెనకబడనీయొద్దు అంటూ స్టాలిన్ (CM Stalin) క్లారిటీ  ఇచ్చారు.

సహకార సమాఖ్య స్ఫూర్తి గురించి అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు పదేపదే నొక్కిచెప్తూ ఉన్న తరుణంలో తమిళనాడు సీఎం స్టాలిన్ పై కామెంట్లు చేయడం గమనార్హం. ఇప్పటికే పలు రాష్ట్రాల నేతలు కేంద్రం పెత్తనాన్ని వ్యతిరేకించాయి. ‘పెద్దన్న’ పాత్ర వద్దంటూ కేంద్రానికి సూచిస్తున్నాయి. మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ కామెంట్లు చేయడం రాజకీయంగా సరికొత్త చర్చకు దారితీసింది. ఆత్మగౌరవం వర్సెస్ ఆధిపత్యం.. అనే తీరులో పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయిందంటూ ప్రజలు ఓపెన్‌గానే చర్చించుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>