కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో చిన్నారి సంగీత మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కవిత (Kavitha) ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే వేడుకల కోసం విద్యార్థినులను పనివాళ్లలా మార్చి టెంట్ హౌస్ వాహనం నుంచి కుర్చీలు దింపించారన్నారు. ఆ సమయంలో ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడిన సంగీత ప్రాణాలు కోల్పోవడం దారుణమన్నారు.
రేవంత్ రెడ్డి సర్కారు నిర్లక్ష్యంతో మరో గురుకుల విద్యార్థిని చనిపోయిందని కవిత ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బిడ్డను కోల్పోయిన సంగీత తల్లిదండ్రులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారు ఈ దుఃఖం నుంచి కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు కవిత (Kavitha).
Read Also: జాతీయ జెండాకు అవమానం.. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు
Follow Us On: Pinterest


