కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazeer) తెలిపారు. రాజధాని అమరాతిలో తొలిసారి జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగించారు. తొలిసారి అమరావతిలో జాతీయ జెండాను ఎగురవేశామని చెప్పారు. రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ఆయన ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టుతో సహా అన్ని ప్రాజెక్టులపై దృష్టిపెట్టినట్లు గవర్నర్ తెలిపారు.
పోలవరం – నల్లమల సాగర్ ప్రాజెక్ట్‌కు (Polavaram – Nallamala Sagar) వేగంగా అడుగులు పడుతున్నాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం పది సూత్రాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రజలే ప్రగతికి నిజమైన శిల్పులు అని కొనియాడారు. ఏపీలో ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని, సంస్థలు మళ్లీ తిరిగి పుంజుకుంటున్నాయని వెల్లడించారు. 2047 నాటి ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazeer) పేర్కొన్నారు.
Read Also: రెడీ అవుతున్న బడ్జెట్ హల్వా..!
Follow Us On: Pinterest


