కలం, వెబ్ డెస్క్: 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్‌కు అమెరికా శుభాకాంక్షలు తెలిపింది. భారత్–అమెరికా మధ్య ఉన్న బలమైన స్నేహబంధాన్ని అమెరికా మరోసారి గుర్తు చేసింది. రెండు దేశాలు రక్షణ, ఇంధనం, కీలక ఖనిజాలు, ఆధునిక సాంకేతికత వంటి రంగాల్లో కలిసి పని చేస్తున్నాయని పేర్కొంది. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో (Marco Rubio) మాట్లాడుతూ… “భారత ప్రజలకు గణతంత్ర దినోత్సవ (Republic Day) శుభాకాంక్షలు. భారత్, అమెరికా మధ్య చారిత్రకమైన సంబంధాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లోనూ ఉమ్మడి లక్ష్యాల సాధన కోసం కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాం” అని తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రతల కోసం క్వాడ్ వేదికగా ఇరు దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
Read Also: రెడీ అవుతున్న బడ్జెట్ హల్వా..!
Follow Us On: Instagram


