epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

రూ.లక్ష ఉంటే ఈ మూడింటిలో పెడితే బెటర్.. రాబడి ఎక్కువ..!

కలం, వెబ్ డెస్క్ : ఈ రోజుల్లో చేతిలో డబ్బుంటే ఎందులో అయినా పెట్టుబడి పెడితేనే చాలా బెటర్. బయటి వ్యక్తులకు వడ్డీలకు ఇచ్చే కంటే ఏదైనా ప్రభుత్వ స్కీమ్ లో పెట్టుబడి పెడితే సేఫ్ గా ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారు. చేతిలో లక్ష రూపాయలంటే ఎందులో పెట్టబుడి పెడితే ఎక్కువ రాబడి వస్తుందనేది చాలా మందికి తెలియదు. ఎన్నో స్కీమ్ లు ఉన్నా.. దేంట్లో పెట్టుబడి పెట్టాలనేది తెలియక తక్కువ వడ్డీ వచ్చే దాంట్లో పెట్టేస్తుంటారు. అలాంటి వారి కోసం మూడు బెస్ట్ ఆప్షన్లు (Best Investment Options) ఉన్నాయి. అవే ఫిక్స్ డ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్ లో లంప్సమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఉన్నాయి. ఈ మూడింటిలో ఐదేళ్ల పాటు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుందో ఓ లుక్కేద్దాం.

ఫిక్స్‌డ్ డిపాజిట్ లో..

లక్ష రూపాయలను ఐదేళ్ల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెడితే 7.5 శాతం వడ్డీ జనరేట్ అవుతుంది. లక్ష రూపాయలకు ఐదేళ్లకు మీకు రూ.1.45లక్షలు వస్తాయి. అయితే ఎఫ్ డీలలో వచ్చే వడ్డీ మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఆదాయ పన్నులు పోగా మీకు వచ్చే రాబడి కొంచెం తగ్గుతుంది. కాకపోతే ద్రవ్యోల్బణంలో మార్పులు వచ్చినప్పుడు మీకు వచ్చే రాబడి కూడా అంత ఉండకపోవచ్చు.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్..

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కేంద్ర ప్రభుత్వం అందించే స్కీమ్. ఇందులో వడ్డీ మీద పన్ను మినహాయింపు ఉంటుంది. ఉదాహరణకు.. మీరు లక్ష రూపాయలను ఐదేళ్ల పాటు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ లో పెట్టుబడి పెడితే మీకు రూ.1.44లక్షలు వస్తాయి. అంటే 44వేలు వడ్డీ వస్తోంది. ఇందులో 7.7 శాతం వడ్డీ జనరేట్ అవుతుంది. కాబట్టి జనరేట్ అయిన వడ్డీ మొత్తం మీరు తీసుకునే ఛాన్స్ ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్ లంప్సమ్..

మ్యూచువల్ ఫండ్ లోని లంప్సమ్ లో పెట్టుబడి పెడితే 10 నుంచి 12 శాతం వడ్డీ జనరేట్ అవుతుంది. ఈ స్కీమ్ లో ఐదేళ్ల పాటు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే.. రూ.1.75 లక్షలు వస్తాయి. అంటే వడ్డీ 75వేలు వస్తోందన్నమాట. కాకపోతే ఇది యావరేజ్ గా చెప్పే వడ్డీ. మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతిసారి ఇంతే వస్తుందనే గ్యారెంటీ లేదు. మార్కెట్ పరిస్థితులను బట్టి పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. కానీ ఐదేళ్లు అంటే దీర్ఘకాలిక పెట్టుబడి కాబట్టి మిగతా స్కీమ్ లతో పోలిస్తే ఇందులో ఎక్కువ వడ్డీ వస్తుంది.

ఈ మూడు స్కీమ్ లు మిగతా వాటికంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. కాకపోతే మీ పెట్టుబడికి భద్రత ముఖ్యం అనుకుంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ లో పెట్టుబడి పెడితే బెటర్. మార్కెట్ మీద మీకు అవగాహన ఉండి.. ఎక్కువ లాభం రావాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ బెటర్. భద్రతతో పాటు కొంత వడ్డీ కావాలి అనుకుంటే ఎఫ్డీలు మంచి ఆప్షన్ (Best Investment Options). కాబట్టి మీ పరిస్థితులు, అవసరాలను బట్టి ఇందులో ఏదైనా ఎంచుకోవచ్చు.

Read Also: పుస్తక నేస్తం అంకెగౌడ.. అక్షర యోగికి అందిన పద్మం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>