కలం, వెబ్ డెస్క్ : నాగర్ కర్నూల్ జిల్లాలో (Nagarkurnool) దారుణం జరిగింది. ముగ్గురు చిన్నారులు నీటికుంటలో పడి చనిపోయారు. జిల్లాలోని ఉర్కొండ మండలం ముచ్చర్లపల్లెకు చెందిన ముగ్గురు చిన్నారులు శ్రీమన్యు(11), స్నేహ, సిరి ఆడుకునేందుకు వెళ్లి నీటి కుంటలో పడ్డారు. స్థానికులు గమనించి బయటకు తీసేలోపే ప్రాణాలు విడిచారు. చిన్నారులు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Also: షాపులో నిద్రపోతుంటే.. షట్టర్లు మూసి తగలబెట్టారు
Follow Us On: Pinterest


