కలం, వెబ్ డెస్క్ : వైసీపీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడితే పేగులు తీస్తా అంటూ ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు (Ayyannapatrudu) కొడుకు చింతకాయల విజయ్ (Chintakayala Vijay) సంచలన కామెంట్లు చేశారు. ఆదివారం కార్యకర్తల మీటింగులో విజయ్ మాట్లాడుతూ.. టీడీపీ వాళ్లు కొందరు వైసీపీ లీడర్లతో మాట్లాడుతున్నట్టు తనకు తెలిసిందని.. అది పరమ దరిద్రమైన పని అంటూ చెప్పుకొచ్చారు. ‘వైసీపీ ప్రభుత్వంలో మనల్ని ఎంతగా ఇబ్బంది పెట్టారో మర్చిపోయారా.. కేసులు పెట్టారు. రోడ్ల మీదకు ఈడ్చారు. అలాంటి పార్టీ వాళ్లతో మాట్లాడుతూ వెన్నుపోటు పొడవాలని చూస్తే పేగులు తీస్తా’ అంటూ చింతకాయల విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో ఉన్నంత కాలం నమ్మకంతోనే ఉండాలని.. తాను చనిపోయేంత వరకు టీడీపీలోనే ఉంటానంటూ తెలిపారు చింతకాయల విజయ్. తన తండ్రి చూపించిన బాటలోనే నడుస్తానని.. తనకు టికెట్ ఇవ్వకపోయినా పార్టీని వీడే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు చింతకాయల విజయ్ (Chintakayala Vijay). ఎవరెవరు పార్టీ లైన్ దాటుతున్నారో వారందరి లిస్టు తన వద్ద ఉందని.. ఒక్కొక్కడిని ఒంగోపెట్టి తన్నుతా అంటూ వ్యాఖ్యానించారు విజయ్.
Read Also: సోలార్ తయారీ హబ్‌గా ఆంధ్రప్రదేశ్.. లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
Follow Us On: Youtube


