epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

ప‌ద్మశ్రీ అవార్డులు ప్ర‌క‌టించిన కేంద్రం

కలం, డెస్క్: ప్రతి ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ‘పద్మ’ అవార్డుల్లో 2026 (Padma Shri Awards) సంవత్సరానికిగాను 45 మందికి పద్మశ్రీ అవార్డు దక్కింది. ఇందులో తెలంగాణకు చెందిన మామిడి రామిరెడ్డి కూడా ఉన్నారు. సమాజంలో అంతగా ప్రచారానికి నోచుకోకుండా వారు నమ్ముకున్న రంగాల్లో సేవ చేస్తూ ఉన్న ‘అన్‌సంగ్ హీరోస్‘ను కేంద్ర ప్రభుత్వం ఈసారి పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. ప్రస్తుతానికి అనధికారికంగా అందిన వివరాల ప్రకారం మొత్తం 45 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతల్లో ఇద్దరు తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు. సామాజిక సేవా రంగంలో సేవలందించిన మామిడి రామారెడ్డి ఇందులో ఒకరు. హైదరాబాద్‌లోని సీసీఎంబీ (CCMB)లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న కుమారస్వామి తంగరాజ్ మరొకరు.

మరణానంతరం పద్మశ్రీ అవార్డు :

రైతాంగం, గ్రామీణ మహిళలు, చేతివృత్తులపై ఆధారపడి బతికే కుటుంబాల ఆర్థిక అవసరాల కోసం మల్టీ-స్టేట్ కోఆపరేటివ్స్, గ్రాస్ రూట్ లెవల్ సహకార సంఘాలను బలోపేతం చేయడంలో మామిడి రామారెడ్డి కృషికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సొసైటీల స్థాపనలో కీలక భూమిక పోషించారు. మహిళా స్వయం సహాయక బృందాల ఆలోచన ఇందులోంచి పుట్టిందే. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సేవలందించినరామారెడ్డి.. పశు సంవర్ధకం, పాడి పరిశ్రమల రంగాల్లో రైతులకు అనేక రూపాల్లో మేలు జరిగేలా వినూత్నమైన ఆలోచనలతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ రంగాల్లో ఆయన చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరంలో ‘మరణానంతర పద్మశ్రీ’ (Posthumous) ప్రకటించింది.

Mamidi Rama Reddy - Padma Sri Awardee
Mamidi Rama Reddy – Padma Sri Awardee

గతేడాది మొత్తం 113 మందికి పద్మశ్రీ, 19 మందికి పద్మభూషణ్, ఏడుగురికి పద్మ విభూషణ్ అవార్డులు లభించగా ఈసారి ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది. కేంద్ర హోంశాఖ వర్గాల నుంచి తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు 45 మందికి పద్మశ్రీ ఖరారైనట్లు తెలిసింది. ఇందులో. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రవేశపెట్టినప్పటి (1954) నుంచి ఇప్పటిదాకా తెలంగాణకు మొత్తం 173 ‘పద్మ’ అవార్డులు (Padma Shri Awards) దక్కాయి. ఇందులో 15 పద్మవిభూషణ్, 34 పద్మభూషణ్, 122 పద్మశ్రీ అవార్డులున్నాయి. దివంగత ప్రధాని పీవీ నర్సింహారావుకు 2024లో, 1963లో జాకీర్ హుస్సేన్‌కు ప్రకటించిన భారతరత్న అవార్డులు ఈ జాబితాకు అదనం. ప్రస్తుతానికి అందిన జాబితా ప్రకారం పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వీరే…

Dr. Thangaraj - PadmaSri
Dr. Thangaraj – PadmaSri

• అంకే గౌడ
• అర్మిడా ఫెర్నాండెజ్
• భగవాన్ దాస్ రైక్వార్
• భిక్ల్యా లడక్యా ధిండా
• బ్రిజ్ లాల్ భట్
• బుధ్రి టాటి
• చరణ్ హెంబ్రామ్
• చిరంజీ లాల్ యాదవ్
• ధార్మిక్‌లాల్ చునీలాల్ పాండ్యా
• గఫ్రూద్దీన్ మేవాటి జోగి
• హల్లీ వార్
• ఇందర్‌జిత్ సింగ్ సిద్ధూ
• కె పజనివేల్
• కైలాష్ చంద్ర పంత్
• ఖేమ్ రాజ్ సుంద్రియాల్
• కొల్లక్కైల్ దేవకి అమ్మ జి
• కుమారసామి తంగరాజ్
• మహేంద్ర కుమార్ మిశ్రా
• మీర్ హాజీభాయ్ కాసంభాయ్
• మోహన్ నగర్
• నరేష్ చంద్ర దేవ్ వర్మ
• నిలేష్ వినోద్ చంద్ర మాండ్లేవాలా
• నూరుద్దీన్ అహ్మద్
• ఓతువార్ తిరుత్తణి స్వామినాథన్
• పద్మ గుర్మెట్
• పోఖిలా లెక్తేపి
• పున్నియమూర్తి నటేశన్
• ఆర్ కృష్ణన్
• రఘుపత్ సింగ్
• రఘువీర్ తుకారాం ఖేడ్కర్
• రాజస్థపతి కలియప్ప గౌండర్
• రామ రెడ్డి మామిడి
• రామచంద్ర గోడ్బోలే మరియు సునీత గోడ్బోలే
• ఎస్ జి సుశీలమ్మ
• సంగ్యుసాంగ్ ఎస్ పోంగెనర్
• షఫీ షౌక్
• శ్రీరంగ్ దేవబా లాడ్
• శ్యామ్ సుందర్
• సిమాంచల్ పాత్రో
• సురేష్ హనగవాడి
• టగా రామ్ భీల్
• టెచి గుబిన్
• తిరువారూర్ భక్తవత్సలం
• విశ్వ బంధు
• యుమ్నం జాత్రా సింగ్

Read Also: నవీన్ పోలిశెట్టి మూవీకి దిమ్మతిరిగే కలెక్షన్స్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>