కలం, నిజామాబాద్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల వేళ నిజామాబాద్ జిల్లా బోధన్ లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి (Sudarshan Reddy) నిరసన సెగ తగిలింది. బోధన్(Bodhan)లో ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం వచ్చారు. ఆయన కాన్వాయ్‌కి అడ్డుగా వచ్చిన బీఆర్ఎస్(BRS) నాయకులు సుదర్శన్ రెడ్డి కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. సుదర్శన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నిధులతోనే ఇప్ప్పుడు పనులు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నిధులు కేటాయించలేదని నిరసన చేపట్టారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్నారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు యాదవ్, మాజీ కౌన్సిలర్ గంగాధర్ లను అదుపులోకి తీసుకున్నారు.


