కలం, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలు వినలేకపోతున్నామని మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) సెటైర్లు వేశారు. నగరి వైసీపీ ఆఫీస్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ భూముల రీసర్వేపై టీడీపీ నేతలు కౌంటర్లు వేశారని.. ఇప్పుడు సీఎం చంద్రబాబు చేస్తోంది కూడా అదే కదా అన్నారు రోజా. తాము రీ సర్వే చేసిన భూములకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సర్వే పేరుతో రంగులు అద్దుతోందని విమర్శించారు. మాజీ సీఎం జగన్ రీసర్వే పేరుతో భూములు కొట్టేస్తారని విష ప్రచారం చేసి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే చేయడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి రోజా.
సీఎం చంద్రబాబు నాలుగుసార్లు సీఎంగా పనిచేసినా నగరిలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. కల్యాణమండపం, సబ్ స్టేషన్, పాలిటెక్నిక్ కాలేజీ, పార్కు, షాదీ మహల్ లాంటివన్నీ వైసీపీ హయాంలోనే పూర్తి చేసినట్టు తెలిపారు మాజీ మంత్రి రోజా. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, ఆలయాలు, స్కూళ్లను తమ ప్రభుత్వంలోనే అభివృద్ధి చేశామని రోజా చెప్పారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఎంతసేపు అబద్ధాలతోనే కాలం నెట్టుకొస్తున్నారని.. ఫేక్ ప్రచారాలతో పబ్బం గడుపుతున్నట్టు రోజా వెల్లడించారు.
Read Also: ఇరుసుమండ బాధితులకు పరిహారం ప్రకటించిన ఓఎన్జీసీ
Follow Us On: Instagram


