epaper
Saturday, January 24, 2026
spot_img
epaper

ట్రెండీ డైరెక్టర్​ తో నితిన్ నెక్ట్స్​​ సినిమా ?

కల, సినిమా: నితిన్ ఒకప్పుడు వరుసగా హిట్ సినిమాలు చేశాడు.. ఇప్పుడు వరుసగా ప్లాప్ మూవీస్ చేస్తున్నాడు.. ఇటీవల వచ్చిన రాబిన్ హుడ్, తమ్ముడు.. ఈ రెండు సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అవ్వడంతో.. ఎల్లమ్మ కాస్త చేజారింది. విక్రమ్ కే కుమార్ తో చేయాలి అనుకున్న సినిమా కూడా ఆగిపోయింది. దీంతో నితిన్ (Nithiin) సినిమా ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు నితిన్.. ట్రెండీ డైరెక్టర్ తో సినిమా చేయనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఎవరా ట్రెండీ డైరెక్టర్..? ఏంటా సినిమా..?

తమ్ముడు సినిమా తర్వాత నితిన్ తో ఎల్లమ్మ సినిమాని పట్టాలెక్కించాలి అనుకున్నారు దిల్ రాజు. అంతా సెట్ అయ్యింది కానీ.. తమ్ముడు ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. దీంతో అంతా మారిపోయింది. ఎల్లమ్మ ప్రాజెక్ట్ కి బడ్జెట్ ఎక్కువ అవుతుంది. నితిన్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేస్తానని చెప్పినా.. వర్కవుట్ కాదనే ఉద్దేశ్యంతో నో చెప్పారట. విక్రమ్ కే కుమార్ తో చేయాలి అనుకున్న ప్రాజెక్ట్ దగ్గర కూడా అదే పరిస్థితి. యు.వీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించాలి అనుకుంది కానీ.. వరుస ప్లాపుల్లో ఉన్న నితిన్ తో చేస్తే వర్కవుట్ కాదనే ఉద్దేశ్యంతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసిందని సమాచారం.

ఈ రెండు సినిమాలే కాదు.. ఆనంద్ దేవరకొండతో సితార సంస్థ తీస్తున్న కల్ట్ మూవీ కూడా నితిన్ చేయాల్సిన సినిమానే. ఈ మూవీ డైరెక్టర్ ఆదిత్య హాసన్ తన ఛాయిస్ మార్చుకున్నాడు. మరి.. నితిన్ (Nithiin) సినిమా ఎవరితో చేస్తున్నాడంటే.. ఆయ్ మూవీతో సక్సెస్ సాధించిన అంజి కె మణిపుత్రతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని నితిన్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో చేయనున్నారని తెలిసింది. అలాగే నీరజ కోనతో కూడా నితిన్ సినిమా ఉందని వార్తలు వస్తున్నాయి. మరి.. ఈ సినిమాలతో అయినా నితిన్ సక్సస్ సాధించి మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

Read Also: విజయ్ దేవరకొండ , రాహుల్ సాంకృత్యాన్ మూవీ బిగ్ అప్డేట్..

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>