కలం, వెబ్ డెస్క్ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ (Kamareddy Collectorate) కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ముఖ్యంగా కలెక్టరేట్ సముదాయంలోని సివిల్ సప్లై విభాగంపై ఏసీబీ బృందం దృష్టి సారించింది. గత కొంతకాలంగా సివిల్ సప్లై శాఖకు చెందిన ఉన్నతాధికారులపై భారీగా అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కార్యాలయం (Kamareddy Collectorate)లోని కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్న అధికారులు, గత కొన్ని నెలలుగా జరిగిన లావాదేవీలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు. సివిల్ సప్లై అధికారులపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి.
Read Also: కాంగ్రెస్, బీఆర్ఎస్ లు సింగరేణిని దోచుకున్నాయి : కేంద్రమంత్రి బండి సంజయ్
Follow Us On: Instagram


