కలం, వెబ్ డెస్క్ : జనగామ (Jangaon) జిల్లా జాఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పెండ్యాల భిక్షపతి(39) అనే రైతు విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు.
పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన భిక్షపతి, ట్రాన్స్‌ఫార్మర్ ఫీజు వైర్ కాలిపోవడాన్ని గమనించి జేఎల్ఎం శ్రీనివాస్‌కు సమాచారం అందించాడు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా జేఎల్ఎం ఆ మరమ్మతు పనిని రైతుకే అప్పగించాడు. లైన్ మెన్‌తో మాట్లాడి LC తీసుకున్నానని, వైర్ నువ్వే వేసుకోమని రైతుకు సూచించాడు.
జేఎల్ఎం మాట నమ్మి భిక్షపతి ఫీజు వైర్ వేస్తుండగా, లైన్ మెన్ కుమారస్వామి ముందస్తు సమాచారం లేకుండా కరెంట్ ఆన్ చేశాడు. దీంతో విద్యుత్ షాక్‌కు గురై భిక్షపతి కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
Read Also: బావిలో పడిన కొడుకు.. కాపాడే క్రమంలో తండ్రి మృతి
Follow Us On: Instagram


