కలం, మెదక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ విచారణపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) విషయంలో చర్యలు తీసుకొని కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao)ల నోరు మూయించకపోతే అది కాంగ్రెస్ పార్టీ పతనానికే దారి తీస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు చాల స్పష్టమైన ఆధారాలు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయడం లేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క బీఆర్ఎస్ నాయకుడి అవినీతి బయటకు తీసి జైల్లో వేయలేకపోవడంతోనే, బావబామ్మర్దులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. సిట్ 2 అయినా ఫోన్ ట్యాపింగ్ కేసుకు ముగింపు తెస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also: ఐఏఎస్, ఐపీఎస్ కేటగిరీపై కొత్త పాలసీ
Follow Us On: Instagram


