కలం, వెబ్ డెస్క్: తెలుగు దేశం పార్టీలో కోవర్టులు (Coverts) ఉన్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు వ్యక్తులు ముసుగు వేసుకొని పార్టీలో చెలామణి అవుతున్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వచ్చిన వారితో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
చింతమనేని ‘కోవర్ట్’ వ్యాఖ్యలపై మంత్రి కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathy) స్పందించారు. పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయంతోనే పార్టీలో చేరికలు జరుగుతాయని పార్థసారథి పేర్కొన్నారు. పార్టీలో చేరే వారి విషయంలో వివాదం అవసరం లేదన్నారు. అధినేత అనుమతితో జరిగిన దానిపై ఎవరూ మాట్లాడకూడదని చెప్పారు. అంతా కలిసిమెలిసి పని చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. మంత్రి కొలుసు పార్థసారథి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు. గతంలో ఆయన వైసీపీలో పని చేశారు. ఈ నేపథ్యంలో చింతమనేని (Chintamaneni Prabhakar) పార్థసారథిని ఉద్దేశించి కోవర్ట్ వ్యాఖ్యలు చేశారని పార్టీలో చర్చ జరుగుతోంది.
Read Also: అన్నవరం ప్రసాదంలో ఎలుకలపై ఈవో ఆగ్రహం.. ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్
Follow Us On : WhatsApp


