Kurnool Bus Tragedy |కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకున్నది. వేమూరి కావేరి ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్(Vemuri Vinod)ను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బస్సు బైక్ ను ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే సీటర్ వాహనాన్ని అనధికారికంగా స్లీపర్‌గా మార్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ బస్సులను ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించి ఆల్ ఇండియా పర్మిషన్ తీసుకొని ఇక్కడ తిప్పుతున్నారు.
Kurnool Bus Tragedy | ఈ కేసులో ఇప్పటికే బస్సు డ్రైవర్ లక్ష్మయ్యను అరెస్ట్ చేశారు. లక్ష్మయ్యకు ఏ-1 నిర్ధారించి అదుపులోకి తీసుకున్నారు. తాజాగా యజమాని వేమూరి వినోద్ ఏ2గా చేర్చారు. ఫోరెన్సిక్ పరీక్షలు, వీడియో సీసీ కెమెరా ఫుటేజ్, బస్సు నిర్వహణ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Read Also: జూబ్లీహిల్స్ బైపోల్ రేవంత్‌కు ఓ అగ్నిపరీక్ష
Follow Us on: Instagram

