కలం, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందినగర్ లోని కేటీఆర్ ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ లోని పోలీస్ స్టేషన్ కు రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో తెలిపారు. మంగళవారమే మాజీ మంత్రి హరీష్ రావును ఇదే కేసులో సిట్ విచారించిన సంగతి తెలిసిందే. ఆ రోజే కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. ఈ కేసులో తనను కూడా విచారణకు పిలుస్తారేమో అంటూ చెప్పారు. ఇప్పుడు నిజంగానే నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారుతోంది. కేటీఆర్ ఇచ్చే వివరణను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తదుపరి యాక్షన్‌పై సిట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇకపై ఈ కేసులో బాధితులు, సాక్ష్యులను కూడా విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also: గీతం వర్సిటీకి హైకోర్ట్ షాక్..! రూ.54 కోట్లు చెల్లించాల్సిందేనంటూ ఆదేశం
Follow Us On: Sharechat


