ఇటీవల థియేటర్లలో విడుదలైన ‘మిత్రమండలి(Mithra Mandali)’ సినిమా రేపు (గురువారం) ఓటీటీలోకి రాబోతున్నది. అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన ఈ కామెడీ మూవీ ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన పొందింది. విజయేంద్రర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శి, విష్ణు, ప్రసాద్ బెహరా, రాగ్ మయూర్, నిహారిక ముఖ్య పాత్రల్లో కనిపించారు. అదనంగా, వీటీవీ గణేశ్, వెన్నెల కిశోర్, సత్య వంటి నటీనటులు సపోర్టింగ్ రోల్లు పోషించారు. ఈ సినిమా ‘అమెజాన్ ప్రైమ్(Amazon Prime)’ లో అక్టోబర్ 6 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను ముందే ఆహ్వానించింది.
‘మిత్రమండలి(Mithra Mandali)’ కథ ఒక గ్రామం నేపథ్యంతో ప్రారంభమవుతుంది. ఈ నలుగురు యువకులు ‘పులిబిడ్డ’గా పిలవబడే ఓ వ్యక్తికి భయపడతారు. అతని కూతురైన స్వేచ్ఛను ఇష్టపడతారు. అయితే అంతలోనే స్వేచ్ఛ కిడ్నాప్ అవుతుంది. ఇది కథలో ట్విస్ట్. ఇక ఇక్కడి నుంచి కథ మరో మలుపు తిరుగుతంది. అసలు కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? ఈ నలుగురు స్నేహితులకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందా? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. కథ పూర్తిగా హాస్యభరితంగా ఉంటుంది. అయితే భావోద్వేగాలు బ్యాలెన్స్ కాకపోవడం, డ్రామా పెద్దగా పండకపోవడంతో కథ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. పూర్తి స్థాయి హాస్య భరితమైన సినిమా అయినప్పటికీ పెద్దగా కామెడీ నవ్వించలేదు. మరి థియేటర్ ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయిన ఈ మూవీ ఓటీటీలోనైనా సక్సెస్ అవుతుందా? అన్నది వేచి చూడాలి.
Read Also: లేడీస్ హాస్టల్లో స్పై కెమెరాలు.. రోడ్డెక్కిన 2 వేల మంది మహిళలు
Follow Us on: Instagram

