epaper
Tuesday, November 18, 2025
epaper

లేడీస్ హాస్టల్‌లో స్పై కెమెరాలు.. రోడ్డెక్కిన 2 వేల మంది మహిళలు

తమిళనాడు(Tamil Nadu), క్రిష్ణగిరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఓ మహిళల వసతి గృహంలో స్పై కెమెరాలు(Spy Camera) అమర్చిన ఘటన మంగళవారం రాత్రి వెలుగుచూసింది. ఒక ప్రముఖ సంస్థ తమ ఉద్యోగుల కోసం ఈ హాస్టల్‌ను నిర్వహిస్తున్నట్టు సమాచారం . సుమారు 2,000 మంది మహిళలు ఇక్కడ వసతి పొందుతున్నారు. వసతి గృహంలో ఓ మహిళకు అనుమానం రావడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. స్పై కెమెరాల వ్యవహారం బయటకు రావడంతో వసతి గృహంలో ఉన్న సుమారు 2,000 మంది మహిళలు ఆందోళనకు దిగారు.

స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అయితే పోలీసులు ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. ఒడిశాకు చెందిన ఒక మహిళా ఉద్యోగి ఈరహస్యంగా స్పై కెమెరాలు(Spy Camera) అమర్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: హర్యాణాలో బ్రెజిల్ మోడల్‌కు ఓటు.. రాహుల్ సంచలన ఆరోపణ

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>