కలం, వెబ్ డెస్క్ : కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడి చిన్న పొరపాటు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పేర్ల విషయంలో తలెత్తిన గందరగోళం కారణంగా నరాల వ్యాధితో వచ్చిన రోగికి డయాబెటిక్ మందులు ఇవ్వడంతో ఆయన మృతి చెందారు.
నాగ బాలరాజు అనే వృద్ధుడు నరాల సమస్యతో చికిత్స నిమిత్తం కామారెడ్డి (Kamareddy)లోని ప్రైవేటు ఆసుపత్రికి వచ్చారు. అదే సమయంలో అదే పేరు కలిగిన మరో వ్యక్తి మధుమేహం చికిత్స కోసం అదే ఆసుపత్రికి వచ్చారు. ఇద్దరి పేర్లు ఒక్కటే కావడంతో డాక్టర్ పొరపడ్డారు. డయాబెటిక్ రోగికి ఇవ్వాల్సిన హైడోస్ మందుల చీటీని నరాల సమస్యతో బాధపడుతున్న నాగ బాలరాజుకు ఇచ్చారు.
డాక్టర్ రాసిచ్చిన ఆ మందులను వాడటంతో నాగ బాలరాజు శరీరంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పడిపోయి ఆయన మృతి చెందారు. రోగి ఎవరో సరిగా నిర్ధారించుకోకుండా మందులు సూచించడం వల్లే ఈ అనర్థం జరిగిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.


