epaper
Wednesday, January 21, 2026
spot_img
epaper

ఖమ్మం కార్పొరేషన్ కి ఇప్పట్లో ఎన్నికలు లేనట్టే..

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాలోని ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ (Khammam Municipal Corporation) పదవీకాలం ఏప్రిల్ చివరి వరకూ ఉన్నందునా ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఖమ్మం కార్పొరేషన్ కు ముందస్తు ఎన్నికలు లేవని ఇటీవల మంత్రి పొంగులేటి కూడా స్పష్టం చేశారు. ఇక ఖమ్మం మినహా 5 మునిసిపాలిటీలు ఏదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లిలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ జాబితా ప్రచురణ పూర్తి అయింది.

పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న వసతుల వివరాలు టి – పోల్ లో నమోదు కూడా చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 5 మునిసిపాలిటీల పరిధిలో 241 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 55 మంది ఆర్ఓ లు, 55 మంది ఏఆర్ఓ లు, 291 మంది పీవో లు, 948 ఓపీఓ లను సిద్ధం చేశారు. 26 మంది జోనల్ అధికారులు, 10 ఎఫ్ఎస్టీ, 10 ఎస్ఎస్టీ టీములు ఏర్పాటు చేశారు. 580 బ్యాలెట్ బాక్స్ లు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

25 సెన్సిటివ్, 32 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు సమాచారం కాగా ప్రతి పోలింగ్​ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్, బయట సీసీ కెమెరా ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 5 పట్టణాలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఇప్పటికే గుర్తించారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ కోసం ప్రింటింగ్ ప్రెస్ గుర్తింపు కూడా పూర్తి చేసినట్లు సమాచారం. కాగా ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే అధికారులకు అవగాహన కార్యక్రమాలు కూడా త్వరలోనే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎన్నికల సన్నద్ధతపై ఎస్​ఈసీ వీడియో కాన్ఫరెన్స్​

ఇదిలా ఉండగా, మున్సిపల్ ఎన్నికల సన్నద్దత పై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని, Khammam జిల్లా కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ త్వరలో కమిషన్ విడుదల చేస్తుందని, షెడ్యూల్ రాగానే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ జారీ నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ పరిశీలన, పోలింగ్ నిర్వహణ కౌంటింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకోవాలని సూచించారు.

క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద చురుగ్గా ఉండే భద్రత సిబ్బందినీ నియమించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ సౌకర్యం ఉండాలని, ప్రతి పోలింగ్ కేంద్రం బయట సిసి కెమేరా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సోషల్ ఎలిమెంట్స్ ను బైండోవర్ చేయాలని చెప్పారు. ఎన్నికల ప్రచార పరిశీలన, కౌంటింగ్ కేంద్రాలు పోలింగ్ కేంద్రాల వద్ద సాధ్యమైనంత డ్రోన్ కెమెరాలు వినియోగించాలని సూచించారు.

ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి మాస్టర్ ట్రైనర్లు జిల్లాకు చేరుకుంటారని, సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఎలక్టోరల్ కు సంబంధించిన అన్ని ఫిర్యాదులు పరిష్కరించాలన్నారు. పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు చేయాలనీ రాణి కుముదిని తెలియజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>