కలం, వెబ్ డెస్క్ : నవీన్ పొలిశెట్టి.. ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Naveen Polishetty), ఇప్పుడు అనగనగా ఒక రాజు.. ఇలా వరుసగా నాలుగు సినిమాలతో సక్సెస్ సాధించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్ సీస్ లో సైతం.. రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేస్తుండడం విశేషం. దీంతో నవీన్ పొలిశెట్టికి మరింత డిమాండ్ పెరిగింది. అయితే.. పెరిగిన డిమాండ్ కు తగ్గట్టుగా తనతో సినిమా చేయాలనుకునే నిర్మాతకు కండిషన్స్ పెడుతున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. నవీన్ పొలిశెట్టి పెట్టే కండిషన్స్ ఏంటి..?
నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) పెడుతున్న ఫస్ట్ కండిషన్.. తన రెమ్యూనరేషన్ 15 కోట్లు.. వరుసగా నాలుగు సినిమాలు హిట్స్ ఇచ్చాడంటే.. ఆమాత్రం అడుగుతాడు. అంత అడగడంలో తప్పు లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక రెండో కండిషన్ ఏంటంటే.. సినిమా వ్యవహారం అంతా తనే చూసుకుంటాడట. ఎందుకు..? ఏంటి..? అని అడగకూడదు. ఫస్ట్ కాపీ తీసి నిర్మాతకు ఇస్తాడు. ఈ రెండు కండిషన్స్ కు ఓకే అంటేనే సినిమా చేస్తానని చెబుతున్నాడని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఒక్క హిట్ వస్తేనే కొంత మంది హీరోలు రెమ్యూనరేషన్ భారీగా పెంచేసి అటిట్యూడ్ చూపిస్తున్నారు.
అలాంటిది వరసగా నాలుగు హిట్స్ అంటే.. ఈ మాత్రం చేస్తాడు. అందులో ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తన నెక్ట్స్ సినిమాను ఈ రెండు కండిషన్స్ కు ఓకే చెప్పిన నిర్మాతతో చేయడానికి అంతా రెడీ చేసుకున్నాడట. అయితే.. దర్శకుడు ఎవరు..? ఈ రెండు కండిషన్స్ కు ఓకే చెప్పిన ప్రొడ్యూసర్ ఎవరు..? అనేది మాత్రం బయటకు రాలేదు. ప్రస్తుతం అనగనగా ఒక రాజు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు నవీన్. ఈ ప్రమోషన్స్ హడావిడి కాస్త తగ్గిన తర్వాత నెక్ట్స్ సినిమా గురించి క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.


