కలం వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)కు సిట్ అధికారులు సంచలన విషయాలు చెప్పినట్లు సమాచారం. హరీశ్ రావు ఫోన్ కూడా పలుమార్లు ట్యాప్ చేశారని అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ విషయం విన్న హరీశ్ రావు ఒక్కసారిగా విస్మయానికి గురైనట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన సిట్ మంగళవారం హరీశ్ రావును విచారించింది. ఈ క్రమంలో తేదీలతో సహా హరీశ్ రావు ఫోన్ ఎప్పుడెప్పుడు ట్యాప్ అయ్యిందో బయటపెట్టింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత కొన్ని నెలల పాటు హరీశ్ రావు ఫోన్ ట్యాప్ అయినట్లు ఆధారాలతో సహా వివరించింది.
ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలే అధికార దుర్వినియోగంతో ఫోన్ ట్యాపింగ్ చేయించారన్న ఆరోపణలు వచ్చాయి. కానీ, బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పని చేసిన హరీశ్ రావు (Harish Rao) ఫోన్ సైతం ట్యాపింగ్‌కు గురైందన్న వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ఈ కేసులో మరికొంత మందికి నోటీసులు జారీ చేసేందుకు సిట్ సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో హరీశ్ రావు అనుచరులు కూడా ఉన్నట్లు సమాచారం.
Read Also: మేడారంలో మహా జాతర ఘట్టానికి శ్రీకారం
Follow Us On : WhatsApp


