కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మూవీ “సలార్”(Salaar). వరుస ఫ్లాప్స్ లో ఉన్న ప్రభాస్ కు సలార్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ హిట్ అందించారు. అయితే సలార్ పార్ట్ 2 (Salaar 2) కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టిఆర్ తో ” డ్రాగన్” అనే మూవీ తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. డ్రాగన్ పూర్తి అయిన తరువాత ప్రశాంత్ నీల్ సలార్ 2 (శౌర్యాంగ పర్వం) పై ఫోకస్ చేయనున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా సలార్ 2 కు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఈ నెల 25న మేకర్స్ సలార్ 2 అనౌన్స్మెంట్ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇటీవల రిలీజ్ అయిన రాజాసాబ్ రిజల్ట్ చూసి డీలా పడ్డ ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ 2 నుంచి బిగ్ అప్డేట్ రానుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


