కలం వెబ్ డెస్క్ : కొత్తగూడెం (Kothagudem) జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఓ బస్సు ప్రమాదం(bus accident) చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. కొత్తగూడెం జిల్లా దమ్మపేట (Dammapeta) మండలం గట్టుగూడెం వద్ద ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే… కేవీఆర్ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు 40 మంది ప్రయాణికులతో రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. కొత్తగూడెం జిల్లాలోని గట్టుగూడెం వద్దకు రాగానే బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని పోలీసుల వాహనాలు, అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. నిబంధనలు పాటించిన విషయంలో కేవీఆర్ ట్రావెల్స్ పై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనతో యాజమాన్యం నిర్లక్ష్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: బొట్టు పెట్టుకున్నాడని స్టూడెంట్ పై వివక్ష
Follow Us On: Youtube


