కలం, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తున్న కొత్త సినిమా కొరియన్ కనకరాజు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. మిరాయ్ ఫేమ్ రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి కొరియన్ కనకరాజు క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ తో పాటు సినిమా రిలీజ్ అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్.
కొరియన్ కనకరాజు గ్లింప్స్ లో వరుణ్ తేజ్ వయలెంట్ మోడ్ లో కనిపించారు. కనకరాజు ఎక్కడ చెప్పమంటూ కమెడియన్ సత్యను కొరియన్ పోలీసులు. అక్కడికి హీరోయిన్ రితిక కూడా వస్తుంది. కనకరాజు ఎక్కడో తెలియని సత్య పోలీసులతో దెబ్బలు తింటుంటాడు. ఆ టైమ్ లో చేతిలో కత్తితో వరుణ్ తేజ్ ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంటుంది. అలాగే ఆయన కళ్లను నీలం రంగులో చూపుతూ హారర్ ఎలిమెంట్ యాడ్ చేయడం ఆసక్తి కలిగించింది.
హారర్ కామెడీ జానర్ లో ఫస్ట్ టైమ్ కొరియన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న చిత్రమిది. కొరియన్ వెబ్ సిరీస్ లు, కొరియన్ మ్యూజిక్, మూవీస్ తెలుగు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటున్న ఈ ట్రెండ్ లో కొరియన్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేయడం కొత్తదనం తీసుకొస్తోంది. ఇటీవల సరైన సక్సెస్ లేని వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ( Korean Kanakaraju) సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సమ్మర్ రిలీజ్ కు కొరియన్ కనకరాజు రెడీ అవుతోంది. మరి.. ఈ సినిమాతో వరుణ్ సక్సెస్ సాధిస్తాడో లేదో చూడాలి.


