కలం, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) నటించిన లేటెస్ట్ మూవీ “అనగనగా ఒక రాజు” (Anaganaga Oka Raju). దర్శకుడు మారి (Maari) ఈ సినిమాను ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ”అనగనగా ఒక రాజు” మూవీ బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు రోజురోజుకు కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి.
తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన కేవలం 5 రోజుల్లోనే నవీన్ సినిమా ఈ ఘనత సాధించింది. నవీన్ కెరీర్‌లో 100 కోట్లు సాధించిన తొలి సినిమాగా ” అనగనగా ఒక రాజు” నిలిచింది. ఈ సినిమాలో నవీన్ సరసన క్యూట్ బ్యూటీ మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరి పెయిర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.


