కలం వెబ్ డెస్క్ : బీజేపీ(BJP) జాతీయ అధ్యక్షుడి(national president) ఎన్నికల ప్రక్రియకు అధికారికంగా షెడ్యూల్ విడుదలైంది. ఈ విషయాన్ని పార్టీ జాతీయ ఎన్నికల అధికారి, రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్ వెల్లడించారు. ఈ ఎన్నికల ప్రక్రియను ఢిల్లీ(Delhi)లోని బీజేపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 16న శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎలక్టోరల్ కాలేజ్ జాబితాను విడుదల చేస్తారు. జనవరి 19న సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అదే రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. సాయంత్రం 6.30 గంటలకు జాతీయ ఎన్నికల అధికారి మీడియాకు ప్రకటన విడుదల చేస్తారు. జనవరి 20న మంగళవారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అధికారిక వెలువడుతుంది. ఇటీవల బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన బీహార్‌కు చెందిన నితిన్ నబీన్ సిన్హా(Nitish Nabin Sinha)ను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్(RSS) నేపథ్యం ఉన్న నితిన్ నబీన్ ఇటీవల నాలుగోసారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు.


