కలం వెబ్ డెస్క్ : నాగర్‌కర్నూల్(Nagarkurnool) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ లారీ(Lorry) డ్రైవర్ అతివేగంతో వాహనాన్ని నడపుతూ ఆర్టీసీ బస్సు(RTC Bus), బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది గాయపడ్డారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో జరిగింది. శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఓ లారీ వేగంగా దూసుకొచ్చి ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ముద్దమల్ల రాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆర్టీసీ బస్సులో పది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


