కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు, అనర్హతకు (MLAs Disqualification Case) సంబంధించిన వ్యవహారం కీలక దశకు చేరుకుంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) లో రేపు (శుక్రవారం) విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు విచారణకు కేవలం ఒక్క రోజు ముందే శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య లపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరూ పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని, ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
గతంలోనే ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇదే తరహా తీర్పులు ఇచ్చిన స్పీకర్, ఇప్పటివరకు మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురికి క్లీన్‌చిట్ ఇచ్చారు. మిగిలిన ముగ్గురిపై పిటిషన్లు ఇంకా పరిశీలనలో ఉన్నాయి. గత విచారణల్లో స్పీకర్‌కు సమయం కేటాయించిన సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
రేపు జరగబోయే అనర్హత కేసు (MLAs Disqualification Case) విచారణలో స్పీకర్ ఇప్పటికే చాలా పిటిషన్లను పరిష్కరించినట్లు కోర్టుకు నివేదించే అవకాశం ఉంది. దీంతో సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ కలుగుతోంది. ఎలాంటి ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర రాజకీయాల్లో కీలకమలుపునకు నాంది పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: జల్లికట్టు పోటీల్లో అపశృతి.. 10 మంది పరిస్థితి విషమం
Follow Us On: Instagram


