కలం, వెబ్ డెస్క్ : తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలాన్ని రాష్ట్రానికే ఒక అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) శ్రీకారం చుట్టారు. గత ఏడాది కాలంగా స్వర్ణ నారావారిపల్లి కార్యక్రమంలో భాగంగా కందులవారిపల్లి, చిన్న రామాపురం, ఎ రంగంపేట గ్రామాల్లో సాధించిన అద్భుత ఫలితాల స్ఫూర్తితో, ఇప్పుడు స్వర్ణ చంద్రగిరి (Swarna Chandragiri) ప్రణాళికను మండలం అంతటా విస్తరించాలని ఆయన నిర్ణయించారు. దీనిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, నిర్దేశించుకున్న లక్ష్యాలను ఏడాదిలోపు సాధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
చంద్రగిరి మండలం మొత్తానికి వర్తింపజేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. స్వర్ణ చంద్రగిరి (Swarna Chandragiri) ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడటంతో పాటు, స్థానికులకు మెరుగైన ఉపాధి మార్గాలను చూపి వారి జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏడాది కాలంలోనే చంద్రగిరి మండలం రూపురేఖలు మారిపోవాలని, ఇందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని ఆయన సూచించారు.
Read Also: అల్టిమేట్ ఆతిథ్యం.. 158 రకాల వంటకాలతో అల్లుడికి సంక్రాంతి విందు
Follow Us On: Pinterest


