కలం, వెబ్ డెస్క్ : సంక్రాంతి వస్తుంది అంటే చాలు అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేవి గాలిపటాలు. చిన్నా పెద్ద తేడా లేకుండా పతంగులను ఎగురవేస్తారు. అయితే, చాలా మందికి వాటి చరిత్రతో పాటు.. ఎలా వినియోగించారు అనే విషయాలు తెలియవు. కేవలం ఆటవిడుపుగా ఎగురవేసే గాలిపటాలను యుద్దాల సమయంలో (Military History of Kites) కూడా వినియోగించారు. గాలిపటం ఎలా పుట్టింది.. యుద్దాల సమయంలో ఎలా వాడారు లాంటి విషయాలను తెలుసుకుందాం.
సుమారు 2500 సంవత్సరాల క్రితం చైనాలో గాలిపటాలు తయారుచేశారు. ప్రాచీన కాలంలో వీటిని సైనిక ఉపయోగాలకు వినియోగించారు. సందేశాలు పంపడం, దూరాలు కొలవడం లాంటి వాటి కోసం ఉపయోగించారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటీష్, ఫ్రెంచ్, ఇటాలియన్, రష్యన్ సైన్యాలు ప్రత్యేక గాలిపటాల ఎగురవేసే శిబిరాలను ఏర్పాటు చేశాయి.
శత్రువుల కదలికలు పసిగట్టడానికి..
యుద్ధ సమయాల్లో శత్రువుల కదలికలను పసిగట్టడంతో పాటు సందేశాలను చేరవేయడానికి గాలిపటాలను వినియోగించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కూడా అమెరికా నావికాదళం అనే ప్రయోజనాల కోసం పతంగులను వాడింది. వాషింగ్టన్ లోని వరల్డ్ కైట్ మ్యూజియంలో ఉన్న వార్ రూమ్ లో యుద్ధంలో ఉపయోగించే గాలిపటాలను ఉంచారు.
రెండో ప్రపంచ యుద్దం సమయంలో ఉన్న బ్యారేజ్ కైట్ ను వాణిజ్య నౌకలపై ఎగురవేసేవారు. గాలిపటాలకు తీగ కట్టి ఆకాశంలోకి పంపించేవారు. దీనివల్ల నౌకపై దాడిచేయడానికి శత్రువుల విమానం వస్తే.. అది తీగకు తట్టుకుని రెక్కలు విరిగిపోయేవి. దీని వల్ల శత్రువులను సులభంగా అడ్డుకునే అవకాశం ఉండేది. అలాగే, గాలిపటాలను ఆకాశంలోకి ఎగురవేసి గన్ ఫైరింగ్ సాధన చేసేవారు. ఇది శత్రువుల విమానాలపై లక్ష్యం తప్పకుండా దాడి చేయడానికి పనికి వచ్చేది. ఇలా అనేక పరిణామాల తరువాత గాలిపటం కేవలం సరదా కోసం మాత్రమే ఎగురవేస్తున్నారు.

Read Also: ఇరాన్ లో భయంకరమైన పరిస్థితులు.. భారత్ భారీ ఆపరేషన్..
Follow Us On : WhatsApp


