కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ (Iran) లో పరిస్థితులు రోజురోజుకూ భయంకరంగా మారుతున్నాయి. ఆర్థిక సంక్షోభం, అవినీతికి వ్యతిరేకంగా మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఇప్పటికే 2500 మందికి పైగా నిరసనకారులు సైన్యం చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు భయంకరంగా మారుతుండటంతో అమెరికా సైనిక చర్యలు చేపట్టడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇండియా (India) అలర్ట్ అయింది. ఇరాన్ లో చిక్కుకున్న 10వేల మందికి పైగా భారతీయులను సురక్షితంగా వెనక్కు తీసుకురావడానికి రేపటి నుంచే భారీ ఆపరేషన్ (Evacuation Operation) స్టార్ట్ చేయబోతోంది.
ఇరాన్ నుంచి మొదటి బ్యాచ్ ను రేపు ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకురాబోతున్నారు. ఇరాన్ నుంచి ఇండియాకు రావాలని అనుకునే వారి వివరాలను టెహ్రాన్ లోని ఇండియన్ ఎంబసీ సేకరిస్తోంది. అయితే ఇరాన్ లో ఇంటర్నెట్ సేవలు బంద్ కావడంతో అధికారులు స్వయంగా ఇండియన్ స్టూడెంట్లు, ఉద్యోగస్తులను కలుస్తూ వివరాలు సేకరించాలని కేంద్రం ఆదేశించింది. భారతీయులు ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్నా సరే ఇండియన్ ఎంబసీని సంప్రదించాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రేపటి నుంచి ప్రత్యేక విమానాల్లో కేంద్ర ప్రభుత్వమే భారతీయులను వెనక్కు తీసుకురానుంది (Evacuation Operation).
Read Also: యుద్ధాలలో గాలిపటాలను ఎలా వాడేవారో తెలుసా?
Follow Us On: X(Twitter)


