కలం, వెబ్ డెస్క్ : గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. ఆ సందడే వేరు. ముఖ్యంగా అల్లుళ్లకు ఇచ్చే మర్యాదలు, ఆతిథ్యం (Sankranti Feast) వేరే లెవల్ లో ఉంటాయి. ఈ సంక్రాంతికి తెనాలికి చెందిన ఒక వ్యాపారవేత్త కుటుంబం తమ అల్లుడిపై ఉన్న ప్రేమను 158 రకాల వంటకాల రూపంలో చాటి అందరినీ ఆశ్చర్యపరిచింది.
రాజమండ్రి అల్లుడికి తెనాలి ఆతిథ్యం..
తెనాలికి (Tenali) చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వందనపు మురళీకృష్ణ, మాధవీలత దంపతుల కుమార్తె మౌనికకు, రాజమహేంద్రవరానికి చెందిన శ్రీదత్తతో గత ఏడాది వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత శ్రీదత్తకు ఇది మొదటి సంక్రాంతి కావడంతో, అత్తమామలు ఈ పండుగను చిరకాలం గుర్తుండేలా ఆతిథ్యం ఇవ్వాలనుకున్నారు. గోదావరి సంప్రదాయం ప్రకారం అల్లుడికి అత్యున్నత గౌరవం కల్పిస్తూ భారీ విందును ఏర్పాటు చేశారు.
విందులో ఏమున్నాయంటే?
మొత్తం 158 రకాల వంటకాలతో విందును సిద్ధం చేశారు. ఇందులో శాకాహారం, మాంసాహార వంటకాలు. నోరూరించే కూరలు, వేపుళ్లు. సంక్రాంతి స్పెషల్ సాంప్రదాయ పిండివంటకాలు అయిన జంతికలు, గవ్వలు వంటివి ఉన్నాయి. రకరకాల స్వీట్లు, పచ్చళ్లు, బిర్యానీలు కూడా కొత్త అల్లుడికి వడ్డించారు.
గోదావరి సంప్రదాయం ప్రతిబింబించేలా..
సాధారణంగా గోదావరి జిల్లాల్లో అల్లుళ్లను ‘మునగ చెట్టు’ ఎక్కించడం (అంటే విపరీతంగా పొగడటం, మర్యాదలు చేయడం) ఆనవాయితీగా ఉంది. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ, అల్లుడు శ్రీదత్తను సాదరంగా ఆహ్వానించి, పసందైన విందును (Sankranti Feast) ఏర్పాటు చేశారు.
Read Also: భారీ కోడిపందెం.. రూ.1.53 కోట్లు గెలిచిన వ్యక్తి
Follow Us On: Sharechat


