కలం, వెబ్ డెస్క్ : ఏపీలో సంక్రాంతి సందర్భంగా భారీగా కోళ్ల పందేలు జరుగుతున్నాయి. కోట్లలో చేతులు మారుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి కోడి పందెంలో (Cock Fight) ఏకంగా రూ.1.53 కోట్లు గెలిచాడు. పశ్చిమగోదావరి తాడేపల్లి గూడెంలో గురువారం గుడివాడ ప్రభాకర్, రాజమండ్రి రమేశ్ కోళ్ల మధ్య పందెం నిర్వహించారు. దీని విలువ రూ.1.53 కోట్లు. రాజమండ్రి రమేశ్ కోడి గెలవడంతో రూ.1.53 కోట్లు ఆయన సొంతం అయ్యాయి. ఈ ఏడాది ఇదే అతిపెద్ద కోడిపందెంగా స్థానికులు చెబుతున్నారు. గత ఐదు రోజులుగా కోనసీమ జిల్లాల్లో ఈ కోడిపందేలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వాటిని చూడటానికి, పందెం కాయడానికి బయటి రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా వస్తున్నారు జనాలు.
Read Also: మొన్న రేవంత్.. నేడు చంద్రబాబు
Follow Us On : WhatsApp


