కలం, వెబ్ డెస్క్ : ఈ రోజుల్లో చాలా మంది డబ్బులను ఎక్కడ సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ చేయాలా అని చూస్తుంటారు. అలాంటి వారి కోసం పోస్టాఫీస్ అందిస్తున్న ‘పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్‘ స్కీమ్ (Recurring Deposit Scheme) గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఇందులో మీ డబ్బులకు 100 శాతం సేఫ్టీ ఉంటుంది. దీని కోసం పోస్టాఫీస్ లో లో రూ.100 కట్టి సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. మీరు రోజుకు రూ.200 చొప్పున అకౌంట్ లో సేవ్ చేసుకుంటే నెలకు రూ.6000 అవుతాయి. ఐదేళ్లకు రూ.3 లక్షలు అవుతాయి. దీనికి మీకు 6.7 పర్సెంట్ వడ్డీ అంటే 68,197 వస్తుంది. అంటే ఐదేళ్లకు అసలు, వడ్డీ కలిపి రూ.3,68,197 వస్తాయి.
ఒకవేళ పదేళ్లకు ఈ పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ను (Recurring Deposit Scheme) పొడిగిస్తే అసలు రూ.7లక్షల 20వేలు.. 6.7 వడ్డీ అంటే 3,05,131 వస్తుంది. మొత్తం రూ.10,25,131 మీ సొంతం అవుతుంది. సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ చేయాలి అనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్. రిటైర్మెంట్ డబ్బులు లేదా.. అడిషనల్ ఇన్కమ్ ను సేవ్ చేయాలి అనుకునే వారికి ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. కావాలనుకుంటే మధ్యలో ఎప్పుడైనా ఈ అకౌంట్ క్లోజ్ చేసుకుని అప్పటి వరకు అసలు, వడ్డీ తీసుకోవచ్చు.
Read Also: భారీ కోడిపందెం.. రూ.1.53 కోట్లు గెలిచిన వ్యక్తి
Follow Us On : WhatsApp


