కలం వెబ్ డెస్క్ : ఓ ఎస్సై నిర్లక్ష్యపు డ్రైవింగ్ నిండు ప్రాణాన్ని బలిగొంది. పండుగ పూట ఓ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేట(Chilakaluripet)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎర్రగొండపాలెం ఎస్సై చౌడయ్య గురువారం ఉదయం చిలకలూరిపేటలో కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. నిద్ర మత్తులో డ్రైవింగ్ చేయడంతో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. చౌడయ్య చిలకలూరిపేట్ లో రోడ్డుపై రెండు బైకులను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలవగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Read Also: నేను విజయ్‌కి పెద్ద ఫ్యాన్ : అన్నామలై
Follow Us On: X(Twitter)


