కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. నటీనటులు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు పండుగ శుభాకాంక్షలు చెబుతూ.. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రభుదేవా (Prabhu Deva) వైవిధ్యంగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటావు’ అంటూ ఎక్స్ లో వీడియో పోస్ట్ చేశారు.
హస్య నటుడు వడివేలుతో కలిసి ప్రభుదేవా యోగాసనాలు వేశారు. ప్రభుదేవా ఆసనాలు వేస్తుండగా.. వడివేలు అనుకరించే ప్రయత్నం చేశారు. ఆసనాలు వేయలేక వడివేలు కిందపడిపోయాడు. మళ్లీ లేచి ఆసనాలు వేసే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో (Video) అభిమానులకు నవ్వులు తెప్పించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


