కలం, వెబ్ డెస్క్: సంక్రాంతి (Sankranti) పండుగ నేపథ్యంలో ఐదో రోజు కూడా ప్రధాన రహదారులు కిక్కిరిసిపోయాయి. ఏపీ, తెలంగాణ వాసులు సొంతూళ్ల బాట పట్టడంతో ట్రాఫిక్ జామ్ నెలకొంది. సొంతూళ్లకు వెళ్లే జనం ప్రభుత్వ వాహనాల బదులు సొంత వాహనాల్లో వెళ్తుండటంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. సిటీ శివారు దాటడానికే కనీసం 4 గంటల సమయం పడుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్-విజయవాడ (Hyderabad–Vijayawada) హైవేపై రికార్డుస్థాయిలో రాకపోకలు సాగాయి. ఇప్పటివరకు పంతంగి టోల్ ప్లాజా మీదుగా ఇరువైపులా 3.04 లక్షల వాహనాలు రాకపోకలు సాగించాయి. వాటిలో విజయవాడ వైపే 2.04 లక్షల వాహనాలు వెళ్లినట్లు అధికారులు తెలిపారు.


