కలం వెబ్ డెస్క్ : నెల్లూరు(Nellore)లో గురువారం ఉదయం ఓ రైలు(Train) ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కావలి(Kavali) రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలు విజయవాడ(Vijayawada) నుంచి తిరుపతి(Tirupati) వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో రైల్వే ట్రాక్ స్వల్పంగా దెబ్బతిన్నది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రైలు పట్టాలు తప్పడంతో ఈ రూట్‌లో నడిచే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమస్యను వేగవంతంగా పరిష్కరించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.


