కలం, కరీంనగర్ బ్యూరో : సోషల్ మీడియా వేదికగా భార్య వలపు వల (Honeytrap) విసరడం.. ఆమెతో సదరు వ్యక్తి ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త వీడియో తీస్తాడు. నగ్న వీడియోలు చూపించి వారిని బెదిరించి అందినకాడికి దండుకుంటారు. గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న వ్యవహారాన్ని పోలీసులు రట్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్ (Karimnagar) రూరల్ మండలంలోని ఆరేపల్లి లో గల శ్రీ సాయి నివాస అపార్ట్మెంట్ లోని ఒక ఫ్లాట్‌లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో ఫోటోలు అప్లోడ్ చేయడంతో పాటు కొంతమంది వ్యక్తులను ఫాలో అవుతూ భార్య వారి మొబైల్ నెంబర్లు తీసుకొని ఇంటికి రప్పించుకుంటుంది. భార్యతో శృంగారంలో ఉన్న సమయంలో భర్త ఎలాంటి అనుమానం రాకుండా వీడియోలు తీసేవాడు. ఇలా రెండు సంవత్సరాలుగా సుమారు 100 వరకు వీడియోలు రికార్డు చేశారు. ఈ వీడియోలతో డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నారు.
ఏడాది క్రితం పరిచయమైన కరీంనగర్ కు చెందిన వ్యక్తి తో కారు లోన్ తోపాటు అపార్ట్ మెంట్ లోన్ కట్టించుకున్నారు. ఇలా ఉన్నది మొత్తం ఇచ్చిన తరువాత నిత్యం ఫోన్ చేసి భార్యాభర్తలు వేధిస్తూ రూ. 5 లక్షలు ఇస్తే వీడియోలు డిలిట్ (Honeytrap) చేస్తానని చెప్పారు. లక్ష రూపాయలు ఇచ్చి మిగిలిన 4 లక్షలు ఇవ్వడానికి అంగీకారం చేసుకున్నాడు. అయితే, సదరు వ్యక్తి వద్ద దాదాపు రూ.14 లక్షల వరకు వసూల్ చేసినా వీడియోలు డిలిట్ చేయకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బుధవారం భార్యాభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: కార్పొరేషన్‌గా నల్లగొండ.. అధికారికంగా గెజిట్ విడుదల
Follow Us On: Pinterest


