కలం, సినిమా : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భారతీయ సినిమా రంగంలో టాప్ స్టార్ గా ఎదిగిన నటులలో ఒకరు. టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ (Pawan Kalyan Creative Works) అనే ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ నిర్మాణ సంస్థ ఇప్పటికే మంచి గుర్తింపు పొందింది.
ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ మరో ప్రముఖ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory)తో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థలు కలిసి ప్రేక్షకులకు అధ్భుతమైన సినిమాలను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలోనే కథలపై చర్చలు ప్రారంభం కాగా, భోగి పండుగ సందర్భంగా ఆ చర్చలను మరో స్థాయికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) – టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) భేటీపై పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో, “భోగి అనే శుభ సందర్భంలో కొత్త ఆరంభాల స్పూర్తితో, రాబోయే ప్రాజెక్టులపై ముందుగా జరిగిన చర్చలను కొనసాగిస్తూ శ్రీ పవన్ కల్యాణ్ గారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత శ్రీ విశ్వప్రసాద్ గారితో మరింత చర్చలు జరిపారు” అని ట్వీట్ చేసింది.
Read Also: యువతలో పెరుగుతున్న గుండె జబ్బులు.. అసలు కారణం ఏమిటి?
Follow Us On: Sharechat


