చేసిన అప్పులు తీర్చలేక ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్(Medak) జిల్లా నర్సాపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంటుంది. తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుమారుడు కూడా తండ్రి లేకుండా ఉండలేనంటూ ఆత్మహత్యకు యత్నించాడు. సయ్యద్ ఆరీఫ్ అనే వ్యక్తం నర్సాపూర్ ప్రాంతంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరీఫ్ కాలికి గాయాలు అయ్యాయి. దాంతో ఏ పని చేయడానికి వీలు కాకపోవడంతో కొంతకాలంగా ఇంటి దగ్గరే ఉంటున్నాడు.
దీంతో చేసిన అప్పులు తీర్చలేకపోతున్నందుకు తీవ్ర మనస్తాపం చెందిన ఆరీఫ్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పురుగుల మందు కొనుక్కొను తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరణానికి ముందే తాను పురుగుల మందు తాగానని కుటుంబ సభ్యులకు తెలుపగా, మీరు లేని జీవితం నాకొద్దు అంటూ, తండ్రి చేతిలో పురుగుల మందు లాక్కొని అరీఫ్ చిన్న కుమారుడు సోయాన్ తాగాడు. వెంటనే వారిద్దరినీ ఆసుపత్రికి తరలించగా తండ్రి ఆరీఫ్ మరణించాడు. సోయాన్‌కు చికిత్స పొందుతున్నాడు.
Read Also: మంత్రులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. అప్పటి వరకు హైదరాబాద్‌లోనే..!

